Friday, March 29, 2024

దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని దేశ సమగ్రతను కాపాడండి.

చీరాల: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలు, ప్రభుత్వ సంస్థల ప్రవేటీకరణ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తమ నిరసన ద్వారా వ్యతిరేకించాలని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేటపాలెం సెంటర్లో సోమ, మంగళ వారాల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలపాలని ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ప్రచార జాత నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరలు,నిత్యావసర వస్తువులు రేట్లు రెండింతలుగా పెరిగాయని ఇప్పటికైనా ప్రజలు మేల్కొని తమ నిరసన ద్వారా ప్రభుత్వ మొండి వైఖరిని ప్రశ్నించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ చీరాల కార్యదర్శి బత్తుల శామ్యూల్
ఏఐటీయూసీ అధ్యక్షులు అచ్యుతుని బాబురావు,భవన నిర్మాణ కార్మిక సంఘ ఉపాద్యక్షులు బాణాల లక్ష్మీనారాయణ,ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రకాష్, త్రిపురం క్రిష్టారెడ్డి,దుర్గాప్రసాద్, శివ, నాగమనోహరలోహియా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement