Saturday, May 4, 2024

అండ‌మాన్ సముద్రంలో – 24గంట‌ల్లో 22కి పైగా భూకంపాలు

అండ‌మాన్ స‌ముద్రంలో 24గంట‌ల్లో 22కి పైగా భూకంపాలు చోటు చేసుకున్నాయి. మంగ‌ళ‌వారం అసోంలో కూడా 3.7 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది. ఈ భూకంపాల కార‌ణంగా ఇప్పటివ‌ర‌కు ఎలాంటి న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. అండమాన్ సముద్రంతో ఉదయం 5.42 గంటల నుండి 20 భూకంపాలు సంభ‌వించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.8 నుండి 5.0 వరకు తీవ్ర‌త నమోదయింది. ఈ రోజు ఉదయం 4.3 తీవ్రతతో భూకంపం దక్షిణ పోర్ట్ బ్లెయిర్ తూర్పు తీరం 187 కి.మీ దూరంలో ఉదయం 8.05 గంటలకు సంభవించింది. పోర్ట్ బ్లెయిర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 215 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.57 గంటలకు 5.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఈ వ‌రుస‌లో అతిపెద్దది. ఈ వ‌రుస ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్పటివరకు ఎలాంటి అస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించలేదు. ఈరోజు ఇప్పటివరకు 11 భూకంపాలు నమోదయ్యాయి. 12.03 గంటలకు 4.6 తీవ్రతతో కూడిన భూకంపం సంభ‌వించింది.

అంతకు ముందు తెల్లవారుజామున 4.45 గంటలకు 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 2.54 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 244 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 2.13 గంటలకు, క్యాంప్‌బెల్ బేకు ఉత్తర-ఈశాన్యంగా 251 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం, పోర్ట్బ్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 261 కిలోమీటర్ల దూరంలో 1.48 గంటలకు 4.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 1.30 గంటలకు, క్యాంప్‌బెల్ బేకు ఉత్తరాన 262 కి.మీ దూరంలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు, పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 258 కి.మీ దూరంలో తెల్లవారుజామున 1.07 గంటలకు 4.5 తీవ్రతతో భూకంపం సంభవించగా, పోర్ట్ బ్లెయిర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 199 కి.మీ దూరంలో 12.46 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. 12.03 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 218 కి.మీ దూరంలో 4.6 తీవ్రతతో భూకంపం నమోదైంది.ఈ వరుస భూకంపాలు ఎందుకు వ‌స్తున్నాయ‌నే దానిపై ఆందోళ‌న వ్య‌క్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement