Tuesday, May 14, 2024

మంత్రి కేటీఆర్ నే ఆశ్చ‌ర్య‌ప‌రిచిన వ్య‌క్తి – అత‌ని ఆచూకీ క‌నుక్కోండ‌ని ఆదేశాలు

ఇంటిలోనే వాకింగ్,జాగింగ్,ర‌న్నింగ్ చేసే వెసులు బాటును ట్రెడ్ మిల్ అందిస్తున్నాయి. ఈ ట్రెడ్ మిల్ లో మోటార్, కన్వేయర్ బెల్టు, ప్లాట్ ఫాం, డిజిటల్ కన్సోల్ వంటి భాగాలుంటాయి. ఇవి నడిచేందుకు పవర్ అవసరం. వీటి ధరలు రూ.15 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటాయి. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్ మిల్ రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. ఈ వుడెన్ ట్రెడ్ మిల్ అచ్చం యాంత్రిక ట్రెడ్ మిల్ లానే పనిచేస్తుండడం విశేషం. పైగా ఇది నడిచేందుకు ఎలాంటి పవర్ అవసరంలేదు. ఈ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ ఆశ్చ‌ర్య‌పోయారు. “వావ్” అంటూ ట్విట్టర్ లో తన స్పందన వెలిబుచ్చారు. ఆ వ్యక్తి వివరాలు తెలుసుకోవాలని తెలంగాణ నూతన ఆవిష్కరణల ప్రోత్సాహక విభాగం టి వర్క్స్ కు సూచించారు. చెక్కలతో ట్రెడ్ మిల్ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement