Thursday, May 16, 2024

తొమ్మిది వంద‌ల రోజుకి చేరుకోనున్న -అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం

జూన్ 4తో అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన ఉద్య‌మం తొమ్మిది వంద‌ల రోజుకి చేరుకోనుంది. ఈ సందర్భంగా అమరావతి సాధన సమితి నాయకులు అమరావతిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతి కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులతో పాటు న్యాయదేవత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించనున్నారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఐకాస నాయకులు ఆరోపించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించి అభివృద్ధి చేపట్టాలని సూచించడడంతో రైతులు కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలోని కొందరూ మంత్రులు మూడు రాజధానుల వైఖరీని కొనసాగిస్తుండడంతో రైతులు తమ ఆందోళనలను మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నారు. ఏపీ సీఎం ప్రజల్లో ప్రాంతాల వారీగా విభజించి వర్గ వైషమ్యాలను రెచ్చగొడు తున్నారని, రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజలను పావులుగా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 4న గేట్‌వే హోటల్‌లో ‘ హైకోర్టు తీర్పు.. అనే పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. 2020 జనవరి నెలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి, కర్నూలు, విశాఖ ప్రాంతాలను మూడు రాజధానులను ప్రకటించడంతో అమరావతి రైతులు ఆందోళనను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా రైతులు దీక్షను కొనసాగిస్తున్నారు. గత మార్చి నెలలో హైకోర్టు కూడా రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement