Saturday, April 27, 2024

దేశ‌వ్యాప్తంగా కోక్ సంస్థ‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా అల్లు అర్జున్-యాడ్ షూట్ లో బిజీగా బ‌న్నీ

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్..పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. రీసెంట్ గా బ‌న్నీ కోక్ కూల్ డ్రింక్ కంపెనీ తమ సంస్థ‌కి బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నియమించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ కు బన్నీ ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికే ఐకాన్ స్టార్ అగ్రిమెంట్ లో భాగంగా ఓ యాడ్ షూట్ కూడా చేస్తున్నారు. ఈ కూల్ డ్రింక్ కంపనీకి సంబంధించిన యాడ్ షూటింగ్ కోసం అల్లు అర్జున్ ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఉన్నారు. ఈ కమర్షియల్ ప్రకటనకు టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

యాడ్ షూట్ పూర్తి చేసి ఈ నెల 19న వీరు ఇండియాకి తిరిగి రానున్నారట‌. అదే సమయంలో ధర్మా ప్రొడక్షన్ 2.0 నిర్మాణంలో అల్లు అర్జున్ ఈ యాడ్ చేస్తున్నారని.. కొల్లిన్ అనే యాడ్ ఫిలిం మేకర్స్ ఈ ప్రకటనకు దర్శకత్వం వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. బన్నీ డ్యాన్స్ చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. కోక్ స్టూడియోస్ అనేది అల్లు అర్జున్ చేతికొచ్చిన మొదటి పెద్ద బ్రాండ్ ఎండార్స్మెంట్ అని చెప్పాలి. గతంలో ఈ శీతల పానీయాల కంపనీకి అనేకమంది సౌత్ స్టార్స్ అంబాసిడర్స్ గా చేశారు కానీ.. ఇండియా వైడ్ ప్రచారకర్తగా ఎవరూ వ్యవహరించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement