Saturday, May 4, 2024

అంతా గులాబీమయం.. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం..

టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ వేడుకలకు సర్వం సిద్ధమయింది. హైదరాబాద్‌ నగరం గులాబీమయంగా మారింది. సోమవారం హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఉదయం 10 గంటలకు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని అంగరంభ వైభవంగా నిర్వహిస్తున్నారు.

ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్‌ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ జరగనుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీచేశారు. సభా వేదిక చుట్టూ 8 పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్లీనరీకి సుమారు 6,500 మంది ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్‌లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ ఈ సమావేశానికి తరలిరానున్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లన్ని గులాబీమయమయ్యాయి. ఈ సమావేశానికి వచ్చే రహదారులన్నీ టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలతో నిండిపోయింది.

మరోవైపు ప్లీనరీకి వచ్చే అతిథులకు భోజనాలను కూడా వడ్డించనున్నారు. ఇందుకోసం 29 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫుడ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: షర్మిలను కలిసిన టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement