Sunday, May 5, 2024

Huzurabad bypoll: కేసీఆర్ లేకపోతే ఈటల ఉండేవాడా?

ఈటల రాజేందర్ తన స్వార్థ రాజకీయాల కోసం రాజీనామా చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. తనకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్‌ చెప్తున్నాడని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రైతులు, సామాన్యులను పీడిస్తున్నదని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అయిపోగానే గ్యాస్ సిలిండర్‌ ధర మరో రూ.200 పెంచుతుందని అన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులను ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఆపొద్దని సీఎం కేసీఆర్‌ మా జీతాలు కోత పెట్టారని తెలిపారు. ఈటల రాజేందర్‌ ఏడేళ్లు మంత్రిగా చేసి ఒక్క డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. కేసీఆర్‌ లేకపోతే అసలు ఈటల రాజేందర్‌ అనేటోడు ఉన్నడా అని ప్రశ్నించారు. 

హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ – బీజేపీల మద్యే పోటీ అన్నహరీష్… ఈ రెండింటిలో దేనికి ఓటువేస్తే లాభమో ఆలోచించాలని ప్రజలను కోరారు. ఎన్నికలప్పుడు ఎటు పడితే అటు ఓటు వేయవద్దని, రెండేళ్ల కోసం జరిగే ఎన్నిక ఇది అని అన్నారు. రెండేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. ఈ రెండేళ్లు ప్రభుత్వం మారదన్న హరీష్…..సీఎంగా కేసఆరే ఉంటారని చెప్పారు. మాట తప్పని పార్టీ టీఆర్ఎస్- అబద్దాల పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. నమ్మకానికి మారు పేరు టీఆర్ఎస్ – అమ్మకానికి మారు పేరు బీజేపీ. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీదన్నారు. వ్యవసాయ మోటార్లకు బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెడతామంటే వద్దని చెప్పి.. మా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారని మంత్రి అన్నారు. రైతు చట్టాలను వ్యతిరేకించిన ఈటల ఇప్పుడు మాట మార్చిండని విమర్శించారు.

ఇది కూడా చదవండి:అంతా గులాబీమయం.. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం..

Advertisement

తాజా వార్తలు

Advertisement