Sunday, May 5, 2024

Omicron: కోలుకున్న ఒమిక్రాన్ బాధితులు

ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. ఇప్పటికే భారత్ సహా 57 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఒమిక్రాన్ గ‌త వేరియంట్ ల కంటే ఐదు రేట్లు తీవ్ర‌మైంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ.. వైరస్ నుంచి బాధితులు కోలుకోవడం ఉప‌శ‌మ‌నం కలిగిస్తోంది. ఇటీవ‌ల రాజస్థాన్ లోని జైపూర్ లో తొమ్మ‌ది మందికి ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. వారి అంద‌రూ కూడా ఓమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారు.

అయితే ఆ తొమ్మిది మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. 7 రోజుల పాటు హోం క్వారైంట‌న్ లో  ఉండాల‌ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు సూచించారు. కాగా ఇటీవ‌ల మ‌హారాష్ట్రలో కూడా ఓ బాధితుడు ఒమిక్రాన్ నుంచి కోలుకున్నాడు. ఇదిఇలా ఉంటే.. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందినా.. ముప్పు తక్కువేన‌ని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోని వారికి ఒమిక్రాన్ ప్ర‌మాద‌మే ఎక్కువ ఉంటుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement