Friday, April 26, 2024

క‌త్రినా-విక్కీల రికార్డ్ ని బ్రేక్ చేసిన – ఆలియా-ర‌ణ‌బీర్ క‌పూర్

సెల‌బ్రిటీల విష‌యాలంటే జ‌నాల‌కి ఎక్క‌డ లేని క్రేజ్ వ‌స్తుంది. అదే వారి ప‌ర్స‌న‌ల్ విష‌యాలంటే మ‌రీను. కాగా రీసెంట్ గా వివాహం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ న‌టులు రణబీర్ కపూర్ -అలియాభట్ వివాహం జరిగింది. ఈ తంతుకి సంబంధించిన ప్రతీ ఫోటోని అలియా అభిమానులతో పంచుకుంది. మెహందీ..సంగీత్ కార్యక్రమాల దగ్గర నుంచి పెళ్లి తంతు ముగిసే వరరకూ ప్రతీ ఫోటోని అభిమానులకు ఇన్ స్టా ద్వారా రీచ్ అయ్యేలా చేసింది. ఎంతో సమయం సైతం కేటాయించి వాటికి అద్భుతమైన క్యాప్షన్స్ ఇవ్వడం..రణబీర్ గురించి వ్యక్తిగతంగా తన అభిప్రాయాలు చెప్పడం వంటివి చేసింది. పెళ్లి కార్యక్రమం ముగిసిన వెంటనే ఆ ఫోటోల్ని ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ నేపథ్యంలో అలియాభట్ ఇన్ స్టాలో అరుదైన ఘనత సాధించింది. ఈ ప్లాట్ ఫాం పై అలియాభట్-రణబీర్ కపూర్ వివాహ ఫోటోల్ని ఎక్కువ మంది ఇష్టపడ్డారు. వీటికి 13 మిలియన్ల మంది లైక్ లు కొట్టారు. ఇన్ స్టాలో ఇది ఓ రికార్డ్ అనే చెప్పాలి. ఇంతకు ముందు ఈ రికార్డు కత్రినా కైప్-విక్కీ కౌశల్ దంపతుల పేరిట ఉండేది. ఆ జంట వివాహ ఫోటోల్ని 12.7 మిలియన్ల మంది లైక్ చేసి రికార్డుకు ఎక్కారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement