Friday, April 26, 2024

వంద‌కోట్ల క్ల‌బ్ దిశ‌గా అఖండ .. ప్యారిస్ లో స్పెష‌ల్ షో ..

అఖండ ఈ చిత్రం రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. హీరోగా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ని పోషించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రం వంద‌కోట్ల క్ల‌బ్ లో చేరే దిశగా దూసుకుపోతోంది. కాగా బాల‌కృష్ణ చిత్రాలు అమెరికాలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంటాయి. కాగా యూఎస్ తో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈల్లో కూడా అఖండ దూసుకుపోతుంది.

దాంతో ఇతర దేశాల్లో ఉంటున్న వారు కూడా డిమాండ్ చేస్తుండటంతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో అఖండ చిత్రం ప్రత్యేక షో వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ప్యారిస్ లోని పాథే లా విల్లెట్ థియేటర్ లో అఖండ షో వేసేందుకు నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం నేటి రాత్రి 7.45 గంటలకు స్పెషల్ షో వేయ‌నున్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement