Tuesday, April 23, 2024

TSRTC: ప్రతి గురువారం ‘బస్‌ డే’.. ఆ రోజు బస్కెక్కాల్సిందే!

తెలంగాణ ఆర్టీసీని ప్రయాణికులకు దగ్గర చేసేందుకు ఎండీ సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడంతోపాటు ప్రయాణికుల కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగం గానే ప‌లు కొత్త ప‌థ‌కాల‌ను తీసుకొచ్చారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక్కో అంశంపై దృష్టి సారిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకునే విధానం సులభతరం చేశారు. పెళ్లికి బస్సు అద్దెకు తీసుకుంటే గిఫ్టులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు.

ఇటీవల ఆయన బస్సుల్లోనే తిరుగుతూ ప్రయాణికులు, సిబ్బంది సాదకబాధకాలు తెలుసుకుంటున్నారు. తాజాగా ఇకపై అధికారులు బస్సుల్లో ప్రయాణించి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సజ్జనార్‌ ఆదేశించారు. ఇక నుంచి ప్ర‌తి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీపోల‌లో ‘బ‌స్సు దినోత్స‌వం’(Bus Day) నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు.

ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రతి గురువారం బస్సుల్లోనే తిరగాలని ఆదేశించారు. గురువారాన్ని ‘బస్‌ డే’గా నామకరణం చేశారు. ఈ నెల 9 గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేయ‌డం వ‌ల్ల ప్ర‌యాణీకుల స‌మ‌స్య‌లను నేరుగా తెలుసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement