Monday, May 6, 2024

ఎయిర్‌టెల్‌ మంత్లీ ప్లాన్‌, 30 రోజుల వ్యాలిడిటీ.. 296, 319 ప్లాన్స్‌

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌. ట్రాయ్‌ సూచించిన మంత్లీ ప్లాన్‌ ఆదేశాలను టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ అమలు చేసింది. ప్రతీ నెల ఏదో ఒక తేదీనే రీచార్జి చేసుకునేలా ఓ ప్లాన్‌ను ప్రతీ కంపెనీ తీసుకురావాలని ఇప్పటికే ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత నెలలోనే జియో మంత్లీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఎయిర్‌టెల్‌ సరికొత్త మంత్లీ ప్లాన్‌ను తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ప్లాన్‌ను ప్రకటించింది. ట్రాయ్‌ ఆదేశాల ప్రకారం.. ఎయిర్‌టెల్‌ కొత్తగా రూ.296, రూ.319 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్‌తో యూజర్లకు 30 రోజుల పాటు వ్యాలిడిటీ దక్కుతుందని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.

ఎయిర్‌టెల్‌ రూ.296 ప్లాన్‌తో 25 జీబీ ఇంటర్నెట్‌ డేటా, అపరమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 30 రోజుల పరిమితితో రానుంది. రూ.319 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 30 రోజుల వ్యాలిడిటీ రానుంది. ప్రతీ నెల ఒకే తేదీన రీచార్జి చేసుకునే వెసులుబాటు ఇక ఎయిర్‌టెల్‌లోనూ వచ్చింది. ఎయిర్‌టెల్‌ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్లాన్స్‌తో అదనపు ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్స్‌తో యూజర్లకు 30 రోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఉచిత ట్రయల్‌, మూడు నెలల అపోలో 24బై7 సర్కిల్‌ సేవలు, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌, వింక్‌ మ్యూజిక్‌ను యూజర్లు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement