Friday, May 3, 2024

త‌మిళ‌నాడు అసెంబ్లీలో బ‌డ్జెట్ స‌మావేశాలు – వాకౌట్ చేసిన విప‌క్ష నేత‌లు

త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఆర్థిక‌మంత్రి ప‌ళ‌నివేల్ త్యాగ‌రాజ‌న్ స‌భ‌లో వార్షిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతోన్న స‌మ‌యంలో విప‌క్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. విప‌క్ష నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు పెట్టొద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌మ‌యంలో నినాదాలు చేయ‌డం స‌బ‌బేనా అంటూ ప్ర‌శ్నించ‌డంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. ఆ త‌ర్వాత బ‌డ్జెట్ ప్ర‌సంగం సాఫీగానే సాగింది. ఇటీవ‌లే ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథరెడ్డి వార్షిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న స‌మ‌యంలో విప‌క్ష టీడీపీ పెద్ద పెట్టున నినాదాలు చేసింది. తాజాగా అదే సీన్ త‌మిళ‌నాడు అసెంబ్లీలోనూ క‌నిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement