Saturday, May 11, 2024

వరంగల్ లో ఘనంగా హోలీ సంబురాలు.. తీర్మార్ స్టెప్పులేసిన సీపీ జోషి..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగను పురష్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషితోపాటు వివిధ స్థాయిల పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలను ఉత్సహంగా చేసుకున్నారు. ముందుగా అధికారులకు, సిబ్బందితో పాటు, వారి కుటుంబ సభ్యులు, చిన్నారులకు రంగులు రాసి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా పోలీస్ బ్యాండ్ వాయించి తీన్మారు పోలీస్ కమిషనర్ తో పాటు అధికారులు, సిబ్బంది తమ స్థాయిలను మరిచి చిందేశారు. ముఖ్యంగా ఈ జోన్ డిసిపి వెంకలక్ష్మీతో పాటు క్రైమ్స్ డిసిపి పుష్పారెడ్డి ఇరువు కల్సి డ్రమ్స్ వాయిస్తుండంతో వరంగల్ పోలీస్ కమిషనర్ నృత్యం చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అధికారులు, సిబ్బందికి మిఠాయిలను అందజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement