Sunday, April 28, 2024

Movie Time | ఆదికేశవ లిరికల్​ సాంగ్​ రిలీజ్.. యూత్​ను హుషారెత్తించే బ్యూటిఫుల్​ సాంగ్!

వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ‘ఆదికేశవ’ సినిమాను రూపొందించారు. నాగవంశీ – సాయి సౌజన్య ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించారు. కాగా, మొదటిసారిగా పవర్​ఫుల్​ టైటిల్ తో .. పవర్​ఫుల్​ పాత్రలో వైష్ణవ్ తేజ్ ఈ సినిమా చేసినట్టు మెకర్స్​ చెబుతున్నారు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్ సీన్స్​ ఎక్కువగా ఉన్నది ఈ మూవీలోనే అని తెలుస్తోంది.

YouTube video

కాగా, లేటెస్ట్​గా ఈ సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ సాంగును మేకర్స్​ ఇవ్వాల కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు. ‘హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా .. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా’ అంటూ సాగే ఈ పాట యూత్​ని ఎంతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక.. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అర్మాన్ మాలిక్ – యామిని ఘంటసాల ఆలపించారు. విదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట బీట్ ఎంతో బాగుంది..

ఇక.. మైనింగ్ కి అడ్డుగా ఉందనే ఉద్దేశంతో శివాలయాన్ని కూల్చడానికి విలన్ యత్నించడం .. అందుకు హీరో అడ్డుపడటం అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ అని మేకర్స్​ హింట్ ఇస్తున్నారు. వైష్ణవ్ తేజ్ జోడీగా ఈ సినిమాలో ఎనర్జిటిక్​ హీరోయిన్​ శ్రీలీల కనిపించనుంది. జోజు జార్జ్ .. అపర్ణ దాస్.. రాధిక ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా, నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement