Wednesday, May 1, 2024

క్షమయే దానం… క్షమయే యజ్ఞం

”క్షమయే దానం, క్షమయే యజ్ఞం. లోకంలో క్షమయే సత్యం. క్షమయే కీర్తి, క్షమయే ధర్మం, క్షమ ఆధారభూతంగానే ఈ జగత్తు నిలిచి వుంది” అంటుంది రామాయణం.
శిక్షించగలిగి ఉండి శిక్షించకపోవడాన్నే క్షమాగుణం అం టారు. తమకు ఎంతటి కష్టం కలిగించిన వారినైనా తిరిగి హా ని చేయకుండా విడిచిపెట్టే ఉదాత్తమైన గుణమే క్షమ. అలాంటి గు ణం కలిగినవాళ్లు మాత్రమే తమకు ఎదురయ్యే కష్టాలకు కృంగి పోరు. కాలానికి ధీటుగా ఎదురు నిలబడి సమాధానమిస్తారు.
తమకు ఆటంకాలు, ఆపదలు కల్పించి కష్టాల బాటలో నిల బెట్టిన వారిపట్ల కోపం లేకుండా ఉండడం అందరికి సాధ్యం కా దు. అలాంటి క్షమాగుణం ఉన్నవారు అరుదుగా కనిపిస్తారు.
అంతటి క్షమాగుణం కలిగిన స్త్రీల గురించి మన పురాణా లు వర్ణించాయి. రామాయణంలోని ఈ కథ చదివితే క్షమాగుణం ప్రాధాన్యత బోధపడుతుంది.
రాజు కుశనాభుడు, అప్సరస ఘ్రుతాచిలకు పుట్టిన నూరు గురు కుమార్తెలు అద్భుత సౌందర్యవతులు. జ్ఞానవంతులు. వారొకసారి వనవిహారం చేస్తుండగా చూసిన వాయుదేవుడు వారిని మోహంచాడు. తనని పెండ్లాడమని ఆ యువతులను కోరాడు. ”తాము తండ్రి చాటు బిడ్డలమని, వివాహ విషయం లో తమకు స్వేచ్ఛ లేదని” వాయువుని తిరస్కరించారు యువ తులు. అందుకు కోపం తెచ్చుకున్నాడు వాయుదేవుడు. వారిని గూనివారిగా మారిపొమ్మని శాపమిచ్చాడు. ఆ కన్యలకు వాయు దేవుని తిరిగి శపించే సమర్ధత ఉన్నప్పటికీ ప్రతి శాపమివ్వలేదు. తిరిగి వెళ్లి తండ్రికి చెప్పారు. వాయుదేవుడి పట్ల అంతటి క్షమా గుణం ప్రదర్శించిన పుత్రికలను మెచ్చుకున్నాడు కుశనాభుడు. నూరుగురు కుమార్తెల వివాహాన్ని బ్ర#హ్మదత్తుడు అనే గొప్ప తప శ్శక్తి కలిగిన రాజుతో జరిపించాడు. ఆయన కరస్పర్శతో నూరు గురు కన్యలు కూడా వారివారి పూర్వపు రూపాలు పొందారు. వాయుదేవుడితో వచ్చిన వైరం మరింత తీవ్రం కాకూడదని కోపా న్ని ప్రదర్శించకుండా సంయనం పాటించారు యువతులు. ఓర్పు, క్షమ, స#హనం కలిగి ఉండాలని లోకానికి చాటిచెప్పారు.
భారతంలో ద్రౌపది కూడా క్షమకు మారుపేరుగా సాక్షాత్క రించే ఒక సన్నివేశం ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో తన సేనలు పరాభవాన్ని ఎదుర్కోవడం చూడలేని దుర్యోధనుడు అవమాన భారంతో ఒక మడుగులో దాగాడు. కురురాజుని సంతృప్తి పరచాలని కంకణం కట్టుకున్న అశ్వత్థామ నిద్రిస్తున్న ఉప పాండవులను నిర్దాక్షిణ్యంగా సం#హరించాడు. జరిగిన దారుణా న్ని తెలుసుకున్న పాండవ మధ్యముడు అశ్వత్థామను వెంటాడి, బంధించి ద్రౌపది ముందు నిలబెట్టాడు. పుట్టెడు దు:ఖంతో పుత్ర శోకం అనుభవిస్తున్న ద్రౌపది అశ్వత్థామను క్షమించి విడిచిపెట్ట మని చెప్పింది. అతడిని చంపితే తన లాగానే అశ్వత్థామ తల్లి కపి కూడ పుత్రశోకం అనుభవించాలని ఆలోచించి వదిలివేయ మంది. ఇది కదా క్షమాగుణానికి పరాకాష్ఠ. ఆ యుగాలలోనే కాదు కలికాలంలోనూ క్షమకు మారు పేరుగా నిలిచినవారున్నా రు. అలాంటివారిలో పాండురంగ భక్తుడు ఏకనాథుడు ఒకడు.
ఒకసారి ప్రతిష్టానపురం గోదావరి నది లో స్నానం చేయడానికి వెళ్ళాడు ఏకనాథు డు. నదిలో దిగి శుభ్రంగా స్నానం చేసి ఒడ్డెక్కి శుచి గల వస్త్రాలు ధరించి నడుస్తుండగా అక్కడే కాచుకుని ఉన్న ఒక యువకుడు ఏకనాథుడి మీద తుపుక్కున ఉమ్మేసాడు. మారు మాట్లాడ కుండా మళ్ళీ నదిలో దిగి తలస్నానం చేసి ఒడ్డె క్కాడు ఏకనాథుడు. ఈసారి కూడా ఆ యువ కుడు ముందు చేసినట్టే మరోసారి ఉమ్మాడు. మునుపటిలాగానే నదిలో దిగి స్నానమాచరిం చి వచ్చాడు ఏకనాథుడు. ఈసారి కూడా ఆ యువకుడు ఆగలేదు. తొలి రెండుసార్లు చేసి నట్టే చేసాడు. అలాగని ఆ యువకుడికి ఏక నాథుడుకి పూర్వ వైరం లేదు. ఏకనాథుడి దృష్టి లో మనుషులంతా ఒక్కటే. తరతమ భేదాలు, కులమత వైషమ్యాలు వద్దనేవాడు. అనేక అభంగాలు వ్రాసి పాండురంగడి ని స్తుతించేవాడు. అది గిట్టని అతని కులస్తులు కొందరు ఆ యువ కుడికి డబ్బిచ్చి అలా చేయమన్నారు. దూరాన ఉండి యువకుడు చేస్తున్నదంతా చూసి సంతోషిస్తున్నారు వారు.
అలా ఆ యువకుడు నూట ఎనిమిదిసార్లు చేసాడు. అయి నా ఏకనాథుడు యువకుడిని ఒక్క పరుషమైన మాట అనలేదు. మారుమాటాడకుండా నదిలో దిగి స్నానం చేసి ఒడ్డెక్కేవాడు. అంతటి దయ, కరుణ, క్షమ కలిగిన ఏకనాథుడుని చూసి యువ కుడి మనసు కరిగిపోయింది. అంతేకాదు అతడి నోటిలో తడి కూ డా ఆరిపోయింది. ఈసారి ఏకనాథుడు ఒడ్డెక్కగానే అతడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు యువకుడు.
రెండు చేతులతో ఆ యువకుణ్ణి లేవనెత్తి ”ఇందులో నీ తప్పే మీ లేదు నాయనా! నీ దయ వల్ల నూట ఎనిమిదిసార్లు గోదావరి నదిలో స్నానం చేసే భాగ్యం దక్కింది నాకు” అన్నాడు ఏకనాథు డు. అదంతా చూసిన ఏకనాథుడి ప్రత్యర్ధులు కూడా చలించి పోయారు. పశ్చాత్తాపం చెందిన మనసుతో పరుగున వెళ్లి ఏక నాథుడిని క్షమాపణ కోరారు. అదీ క్షమాగుణం గొప్పతనం.
”క్షమయ జనుల కాభరణము, క్షమయ కీర్తి
క్షమయ ధర్మంబు, క్షమయ సజ్జనగుణంబు
క్షమయ యజ్ఞంబు, క్షమయ మోక్షంబు, క్షమయ
సకలదానంబు, క్షమయందె జగము నిలుచు”
అంటుంది భాస్కర శతకం. క్షమాగుణం ఒక్కటే ఆభరణం, కీర్తి, ధర్మం అనీ అదే సజ్జనుల గుణమనీ, క్షమాగుణమే యజ్ఞం, మోక్షం, అన్ని దానాలకూ సమానమనీ బోధిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement