Tuesday, May 7, 2024

సోదరుడి హత్య కేసులో నటి అరెస్ట్!

సోదరుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటి షనయా కట్వేను హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నటి షనయా సోదరుడు రాకేశ్ ఏప్రిల్ 9న హత్యకు గురయ్యాడు. అతని తలను వేరు చేసి శరీర భాగాలను హంతకులు హుబ్లీ సమీపంలోని పలు ప్రాంతాలలో పడేశారు. తాజాగా రాకేశ్ తల దేవరగుడిహల్ అటవీ ప్రాంతంలో లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నియాజ్ అహ్మద్, తౌఫిఫ్, అల్తాఫ్, అమన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. షనయా కొంతకాలంగా నియాజ్ అనే వ్యక్తితో ప్రేమాయాణంగా సాగిస్తోందని, దానిని ఆమె సోదరుడు రాకేశ్ వ్యతిరేకించడమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

రాకేశ్ హత్యలో అతని సోదరి, నటి షనయ హస్తం కూడా ఉందని పోలీసులు తేల్చారు. షనియా ప్రేమ వ్యవహారంపై రాకేశ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు వ్యతిరేకించాడు. దాంతో వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో రాకేశ్ను తన ప్రియుడితో కలిసి హత్య చేశారు. హుబ్బాలిలోని సొంత ఇంటిలోనే రాకేశ్ గొంతు కోసి హత్య చేశారనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది.

కాగా, 2018లో రాఘవేంద్ర ప్రభు దర్శకత్వంలో ‘ఇదమ్ ప్రేమమ్ జీవనమ్’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇటివల ‘ఒందు ఘంటేయ కథే’ అనే సినిమాలో నటించింది. కాగా, షనయా తన సోదరుడిని హత్య చేయించడంపై కన్నడ ఇండస్ట్రీ  ప్రముఖులు  విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement