Friday, April 26, 2024

కమనీయం.. రమణీయం ఒంటిమిట్ట‌ సీతారాముల కళ్యాణం

ఒంటిమిట్ట, వైఎస్సార్‌ జిల్లా, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా కమనీయం..రమణీయంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపద్యంలో ఆలయ ప్రాంగణంలోనే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏకాంతంగా కళ్యాణం నిర్వహించారు. కంకణబట్టర్‌, రాజేష్‌ బట్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 8 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపన, సద అనుజ్ఞ, పుంజాహవచనం, లోక కళ్యాణంకోసం సంకల్పం చేయించారు. తదుపరి ర క్షాబంధనం, యజ్ఞోప వీతపారణ, వరశ్రేషణం (కన్యావరణం), మధుపర్తాచన చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామ చంద్రుల ప్రవరణలు చదివారు. వంశ స్వరూపాన్ని స్తుతించారు. తదు పరి మంగళసూత్రం పూజ, మాంగళ్యధారణ, అక్షకారోపణం చేపట్టారు. అనంతరం స్వామి విభేదన, వేదస్వస్థి, ఆశీర్వచ నంతో కళ్యాణ ఘట్టం పూర్తి అయ్యింది. కరోనా వైరస్‌ కారణంగా భక్తులు తమ ఇళ్ళనుండే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రచారం నిర్వహించడం జరిగింది.

పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి
ఒంటిమిట్ట శ్రీ కోదండరా ముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి వైభవంగా కల్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వామివారికి. అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మూలవరులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు చిప్పగిరి ప్రసాద్‌, జేఈవో సధా భార్గవి, డిప్యూటీ ఈవో రమేష్‌ బాబు, పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రాములవారి ఆశీస్సులు ఉండాలి..మంత్రి వెల్లంపల్లి
కరోనా కష్టకాలంలో ప్రజల సంక్షేమ అభివృద్ది పనులు కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి శ్రీరాములవారి ఆశీస్సులు ఉండాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సోమవారం రాత్రి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాములవారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే అదృష్టమన్నారు. కోవిడ్‌ కారణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా, శ్రాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలపై శ్రీరాములవారి కరుణాకటాక్షాలు ఉండాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement