Tuesday, May 21, 2024

ఉగాదికి ‘ఆచార్య’ స్పెష‌ల్ ట్రైల‌ర్ !

టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ త‌రువాత వ‌స్తోన్న భారీ చిత్రం ఆచార్య‌. బడ్జెట్ పరంగా కాకపోయినా మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ వల్ల సహజంగానే ఈ సినిమా భారీతనాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ ఇమేజ్ ఎలాగూ కలిసొస్తుంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలాన్ని అందించనుంది. ఉగాది’ కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ ట్రైలర్ వదిలే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అలాగే ‘శ్రీరామనవమి’కి ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఆ రోజు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచనున్నారని అంటున్నారు. హీరోయిన్స్ గా కాజల్ అగ‌ర్వాల్ .. పూజ హెగ్డే కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement