Thursday, May 2, 2024

మంచు వ‌ల్ల ప్ర‌మాదం – వంద వాహ‌నాలు ఢీ

మంచు కార‌ణంగా వాహ‌నాలు అదుపుత‌ప్పి , ఒక‌దానికి మ‌రొక‌టి ఢీ కొట్టాయి. ఈ ఘ‌ట‌న‌లో వంద వాహ‌నాలు అదుపుత‌ప్పాయి. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని విస్కాన్సిన్ ఐసీ రోడ్ లో చోటు చేసుకుంది. వాహ‌నాఉల రోడ్డంతా చింద‌ర వంద‌ర‌గా ప‌డి ఉన్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణాన్ని నిలిపేశారు. ఇంటర్‌స్టేట్ 94 రహదారిపై వెళ్లిన మైక్ ఓల్సెన్ ఈ వార్త‌ని తెలిపారు.. ఆ ఘటన ఊహించినదాని కన్నా స్వల్ప సమయంలోనే జరిగిపోయిందన్నారు. రహదారిపై ట్రాక్టర్లు, సెమీ ట్రాక్టర్లు ఢీకొన్ని అస్తవ్యస్తంగా పడి ఉన్న దృశ్యాలను ఆయన తన కెమెరాలో బంధించాడు.

అలాగే, ఆ హైవేపై చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదాన్నీ చిత్రించారు. నేడు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు జాగ్రత్తలు వహించాలని విస్కాన్సిన్ గవర్నర్ టోనీ ఎవర్స్ ప్రజలను కోరారు. కొన్ని చోట్ల రోడ్ల పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పాడు. పశ్చిమ విస్కాన్సిన్ ప్రాంతంలో ఓ చోట ప్రమాదకరమైన రోడ్ల పరిస్థితుల వల్ల యాక్సిడెంట్లు జరిగాయని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement