Sunday, April 28, 2024

వ్యాక్సినేషన్​కు ఆధార్​ అక్కర్లేదు.. యూజర్​ ఫ్రెండ్లీగా కొవిన్​ ఉండాలే: సుప్రీంకోర్టు

టీకా పేరుతో అధికారులు ఆధార్ కార్డు మాత్రమే కావాలని అడగొద్దని, సుప్రీంకోర్టు తెలిపింది. పూణేకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త సిద్ధార్థశంకర్ శర్మ దాఖలు చేసిన PILపై ఇవ్వాల న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ , సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

COVID-19 వ్యాక్సినేషన్ కోసం CO-WIN పోర్టల్‌లో ఆధార్ కార్డ్ వివరాలను సమర్పించడం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రజలను ఆధార్ కార్డ్ కోసం పట్టుబట్టవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. టీకా కోసం కొన్ని సెంటర్లలో ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారన్న దానిపై పిల్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ , సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.

కొవిడ్​19 టీకా, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) పిటిషన్‌లో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. CO-WIN పోర్టల్‌లో నమోదు చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని,  తొమ్మిది ఐడెంటిటీ కార్డుల్లో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చని తెలిపింది. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఆధార్​ తప్పనిసరి కాదని పేర్కొంది. సంబంధిత అధికారులందరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విధానానికి అనుగుణంగా పనిచేస్తారని పిల్​ విచారణ సందర్భంగా బెంచ్ పేర్కొంది.

ఆధార్ ఒక్కటే ముందస్తు షరతు కాదని, ఎలాంటి గుర్తింపు కార్డు లేని 87 లక్షల మందికి టీకాలు వేశామని మంత్రిత్వ శాఖ తరఫు న్యాయవాది అమన్ శర్మ బెంచ్​కి చెప్పారు. వ్యాక్సినేషన్ కేంద్రాలు ఆధార్ కార్డు అడగకూడదని పిటిషనర్ తరపున వాదించిన న్యాయవాది మయాంక్ క్షీరసాగర్ అన్నారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్/వ్యాక్సినేటర్ కోసం CO-WIN పోర్టల్‌లో ఆధార్ వివరాలను సమర్పించే తప్పనిసరి ముందస్తు షరతును తొలగించాలని దీనికి తగు ఆదేశాలివ్వాలని  ఫిర్యాదు దారు కోరారు. దీనికి తగ్గట్టు CO-WIN పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేయడానికి ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు దిశానిర్దేశం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. CO-WIN పోర్టల్‌ను తగిన సాఫ్ట్ వేర్/సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌డేట్ చేయాలని, యూజర్ ఫ్రెండ్లీగా దేశంలోని పౌరులంతా ఉపయోగించేలా చూడాలని కేంద్రాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement