Saturday, December 10, 2022

Big Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త కోణం.. బీజేపీ నేత‌ల‌కు నోటీసులు ఇవ్వ‌నున్న సిట్‌

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కొత్త మ‌లుపు తీసుకుంటోంది. ఇవ్వాల అడ్వొకేట్ శ్రీ‌నివాస్‌ని సిట్ అధికారులు హైద‌రాబాద్‌లో విచార‌ణ జ‌రిపారు. కాగా, ఆయ‌న మ‌రికొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు వెల్ల‌డించిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొంత‌మంది బీజేపీ నేత‌ల‌కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు రెడీ అవుతున్నారు. ఇక రేపు (మంగ‌ళ‌వారం) కూడా శ్రీ‌నివాస్‌ని విచార‌ణ‌కు రావాల‌ని అధికారులు కోరారు. కాగా, బీజేపీ నేత బీఎల్ సంతోష్‌తోపాటు, జ‌గ్గు స్వామీకి నోటీసులు అందించేందుకు త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement