Wednesday, May 15, 2024

వారంద‌రి కోసం రూ. 8 కోట్లు ఫిక్స్ డ్ చేసిన ‘పునీత్’..

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కేవలం వెండితెరపైనే హీరో కాదు.. నిజ జీవితంలోనూ సూపర్ హీరో అనిపిస్తోంది ఆయ‌న చేసిన ప‌ని చూస్తుంటే. తాజా సమాచారం ప్రకారం పునీత్ తన దాతృత్వ ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లడానికి గతంలో 8 కోట్ల రూపాయల మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూపంలో డిపాజిట్ చేశాడు. ఇప్పుడు పునీత్ మరణించడంతో ఆ మొత్తాన్ని ఆయన ఆధ్వర్యంలో నడిచిన 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, గతంలో ఆయన నిర్వహించిన 45 పాఠశాలలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబోతున్నారట. అయితే రూ. 8 కోట్ల డిపాజిట్ గురించి పునీత్ కుటుంబం ఇంకా స్పందించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement