Friday, May 3, 2024

ఓల్డేజ్ లో గోల్డెన్ రికార్డు: కాళ్లు, చేతులు కట్టేసినా అరేబియాలో 3.5 కిలో మీటర్ల ఈత..

అతని వయస్సు 66 ఏళ్లు.. పింఛన్ తీసుకుని కృష్ణా, రామా అని న్యూస్ పేపర్ ఆసాంతం చదువుతూ కూర్చొకుండా ఆ ఓల్డ్ ఏజ్ వ్యక్తి కొత్త ఫీట్ చేశాడు. అందరిలా తాను ఉండబోనని, తాను ఎంత స్పెషలో ఈ లోకాలనికి తెలియజెప్పాలనుకున్నాడు. అంతే.. యంగ్ ఏజ్ పీపుల్ కూడా చేయలేని ఫీట్ చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ముసలాయన స్టోరీ ఏంటో చదివేద్దాం..

అరేబియా సముద్రంలో 3.5 కిలో మీటర్ల దూరం ఈత కొట్టడం కొందరికి సాధ్యం అవుతుంది.. అదే కాళ్లు, చేతులు కట్టేసి ఈతకొట్టాలంటే మాత్రం అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ, చేతులు, కాళ్లను బంధించి 5 గంటల 35 నిమిషాల పాటు ఈదుతూ ఉడిపికి చెందిన 66 ఏళ్ల వ్యక్తి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరాడు. నిన్న (సోమవారం) ఉదయం 7.50 గంటలకు ఉడిపిలోని పదుకెరె బీచ్ ఒడ్డు నుంచి సముద్రంలోకి ప్రవేశించిన గంగాధర్ కడేకర్ మధ్యాహ్నం 1.25 గంటలకు ఈత పూర్తి చేశాడు.

ఈ ఫీట్‌ను వీక్షించిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి మనీష్ విష్ణోయ్ కడేకర్‌కు ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేశారు. పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉండే వయస్సులో ఈతలో తను సాధించిన ఘనత నిజంగా గొప్పది  అని విష్ణోయ్ అన్నారు. తన రెండు చేతులు, కాళ్లు గొలుసులతో కదలకుండా కట్టేసినప్పటికీ తాను డాల్ఫిన్ లాగా ఈదినట్టు కడేకర్ చెప్పారు. ‘‘ఈ తరం యూత్ తన నుంచి ప్రేరణ పొందేలా చేయడానికే ఈ రికార్డు సృష్టించానని, ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు  కడేకర్.

కడేకర్ ఇతర రికార్డులు..

గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన  పదుకెరె వద్ద ‘పద్మాసనం’ భంగిమలో కాళ్లకు గొలుసు కట్టుకుని 73.7 నిమిషాల్లో 1.4 కి.మీ ఈదడం ద్వారా కడేకర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరారు. సెయింట్ మేరీస్ ఐలాండ్‌లో తన 41 మంది విద్యార్థులతో ఈత కొట్టి రికార్డు సృష్టించారు.  50 ఏళ్ల వయసులో స్విమ్మింగ్‌లో పాల్గొన్న మిస్టర్ కడేకర్ ఉడిపిలో జై దుర్గా స్విమ్మింగ్ క్లబ్‌ను స్థాపించి రెండేళ్లుగా యువతకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో 1000 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అతను రాష్ట్ర, జాతీయ స్థాయి ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నారు. సీనియర్ స్థాయిలో 31 బంగారు, 16 రజత, తొమ్మిది కాంస్య పతకాలను కూడా కడేకర్ గెలుచుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement