Sunday, April 28, 2024

పేద ప్రజలకు కేంద్రం తీపికబురు.. మే, జూన్ మాసాలకు ఉచిత రేషన్

కరోనా నేపథ్యంలో మోదీ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేసినట్లే … వచ్చే మే, జూన్ మాసాల్లో కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దేశంలో సెకెండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడం, పలువురు పేదలు పనులు లేక పస్తులుడడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేదలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేయనున్నారు. దీనికోసం రూ. 26 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది.

దేశంలో ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో కఠినమైన కోవిడ్ ఆంక్షలు విధించారు. దేశ వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ విధిస్తారన్న భయంతో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. స్వస్థలాలకు చేరిన వారికి గ్రామాల్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement