Thursday, April 25, 2024

రియల్ హీరో కు కరోనా నెగిటివ్

కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి సహాయసహకారాలు అందించాడు. అయితే ఇటీవల సోనూసూద్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా తాజా నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ వచ్చిందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు సోనూ. మరోవైపు సోనూసూద్ కు నెగిటివ్ రావడం పట్ల అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

ఇదిలా ఉండగాఆక్సిజన్, రెమ్‌డెసివిర్, బెడ్స్‌ ఉదయం లేచిన దగ్గర్నుంచీ, అర్ధరాత్రి నుండి మరుసటి ఉదయం వరకు ఈ 3 పదాలే తనకు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కొన్నిసార్లు పాస్ అవుతున్నా, మరి కొన్నిసార్లు విఫలమవుతున్నా..అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవుడు అందరినీ చల్లగా చూడాలంటూ సోనూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఆగస్టు 15 న దేశభక్తిని చూపించే వారికి ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చారు. దేశం కోసం ఏదైనా చేయటానికి , దేశభక్తిని చూపించడానికి ఇంతకు మించిన సమయం లేదు స్పందించాలంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement