Friday, May 3, 2024

దక్షిణ్ ఎక్స్​ప్రెస్ రైలు ప్రమాదానికి 35 ఏండ్లు.. భారీ వ‌ర‌ద‌లే కార‌ణం!

మంచిర్యాల- రవీంద్రఖని స్టేషన్ల మధ్య వరద ప్రవాహానికి దక్షిణ్​ ఎక్స్​ప్రెస్​రైలు ప్రమాదానికి గురై 35 ఏండ్లు గడిచాయి. ఈ ప్రమాదంలో 53మంది ప్రయాణికులు మృతిచెందిన విషయాన్ని సింగరేణి కోల్​బెల్ట్ ప్రాంత వాసులు గుర్తుచేసుకున్నారు. భారీ వర్షాల దెబ్బకు 1987 జులై 9న తెల్లవారుజామున మందమర్రి మండలం క్యాతన్​పల్లిలోని అమరవాది చెరువు కట్ట తెగింది. ఆ వరద ప్రవాహానికి 3 కిలోమీటర్ల దూరంలోని రైల్వే ట్రాక్ట్​ కొట్టుకుపోయింది.

దీంతో ఉదయం 4.30 ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న నిజామొద్దీన్ దక్షిణ్​ఎక్స్​ప్రెస్ దక్షిణ్​ఎక్స్​ప్రెస్ ప్రమాదానికి గురైంది. రెండు బోగీలు సుమారు 50 మీటర్ల దూరం కొట్టుకపోయాయి. రైలులోని 53 మంది ప్యాసింజర్లు చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. రామకృష్ణాపూర్​లోని సింగరేణి కార్మికులు, అమరవాది, క్యాతనపల్లి, గద్దెరాగడి, దుబ్బపల్లి గ్రామస్తులు ప్యాసింజర్లను రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement