Friday, May 3, 2024

ఘనంగా బక్రీద్ వేడుకలు

బక్రీద్ పర్వదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఆదివారం ఎడతెరపి లేని వర్షం కురియడంతో ముస్లిం సోదరులు ఈద్గా వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలను మసీదుల్లోనే నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జామా మసీదు వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement