Tuesday, May 7, 2024

2nd Test: ఎనిమిదో వికెట్ డౌన్.. ఆసీస్ స్కోరు 110/8

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోతోంది. 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టు 110 పరుగుల వద్ద అలెక్స్ కారే రవీంద్ర జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఈరోజు ఉదయం మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్లు రావడం పెవిలియన్ కు చేరుకోవడమే అయ్యింది. తక్కువ స్కోరుకే ఆసీస్ జట్టు 8 వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement