Friday, April 26, 2024

జ‌డేజాకు 5 వికెట్లు – అల‌క్స్ క్యారీ ఔట్ – 110/8

ఢిల్లీ లో జ‌ర‌గుతున్న రెండో టెస్ట్ లో ఆసీస్ వ‌రుస‌గా వికెట్లు కోల్పొతున్న‌ది.. ఎనిమిదో వికెట్ రూపంలో అలెక్స్ క్యారీని జ‌డేజా ఔట్ చేశాడు. దీంతో జ‌డేజాకు అయిదు వికెట్లు ల‌భించాయి.. అంత‌కు ముందు మ్యాట్ రెన్ షా, హ్యండీ కోంబ్ లు వెంట వెంటనే ఔటయ్యారు.. హ్యాండీ కోంబ్, ప్యాట్ కమిన్స్ వికెట్ లు జడేజాకు లభించాయి. అశ్వీన్ మ‌రో వికెట్ సాధించాడు.. మ్యాట్ రెన్ షాను 2 ప‌రుగుల‌కు ఎల్ బి డబ్ల్యు రూపంలో ఔట్ చేశాడు.. ఈ మ్యాచ్ లో ఆశ్విన్ కు ఇది మూడో వికెట్ . అంత‌కు ముందు నిల‌క‌డ‌గా ఆడుతున్న మార్నెస్ ల‌బుస్ ను జ‌డేజా బౌల్డ్ చేశాడు.. ట్రావెస్ హెడ్ 43 ప‌రుగులు చేసి అశ్వీన్ బౌలింగ్ లో కీప‌ర్ భ‌ర‌త్ క్యాచ్ పట్ట‌డంతో ఔట‌య్యాడు.. ఆ త‌ర్వాత స్మిత్ వికెట్ ను అశ్వీన్ ఎల్ బి డ‌బ్ల్యు గా పెవిలియ‌న్ కు చేర్చాడు.. స్మిత్ తొ్మ్మిది ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఆసీస్ 8 వికెట్ల న‌ష్టానికి 110ప‌రుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement