Sunday, May 5, 2024

Omicron: 24 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కేసులంటే..

భారత్ లో ఓవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,135కి చేరింది. ఇందులో 828 మంది బాధితులు కోలుకున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి దేశంలోని 24 రాష్ట్రాలకు పాకింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం అత్యధికంగా మహారాష్ట్రంలో 653 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో 464 కేసులు నమోదు అయ్యాయి.

కేరళ, రాజస్ధాన్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేరళలో 185, రాజస్థాన్ లో 174, గుజరాత్ లో 154, తమిళనాడులో 121 వెలుగు చూశాయి. ఒమిక్రాన్ కేసుల్లో దేశంలో తెలంగాణ ఏడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. 84 కేసులతో తెలంగాణలో ఏడో స్థానంలో ఉంది. కర్ణాటకలో 77, హర్యానా 71, ఒడిశా 37, యూపీ 31, ఆంధ్రప్రదేశ్ 24, వెస్ట్ బెంగాల్ లో 20 కేసులు నమోదు అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement