Saturday, May 18, 2024

‘సిరివెన్నెల’ కుటుంబానికి ‘ప్ర‌భాస్’ ప‌రామ‌ర్శ‌

సినీ సాహిత్య దిగ్గ‌జం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. సిరివెన్నెల కుటుంబ‌స‌భ్యుల‌తో ప్ర‌భాస్ మాట్లాడారు. కాసేపు ఆ ఫ్యామిలీతో గ‌డిపారు రెబ‌ల్ స్టార్. ఈ సంద‌ర్భంగా సిరివెన్నెల కుమారులు యోగేష్, రాజాలతో మాట్లాడారు. వారిని ఓదార్చాయ‌న‌. ప్ర‌భాస్ తో పాటు క‌మెడియ‌న్ , క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌భాస్ శ్రీను కూడా ఉన్నారు. కాగా ప్ర‌భాస్ వ‌చ్చాడ‌న్న వార్త తెలుసుకున్న చుట్టు ప‌క్క‌ల జ‌నం ప్ర‌భాస్ ని చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. ఫ్యాన్స్ ఈల‌లతో మోత మోగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement