Saturday, May 4, 2024

Telangana: ఇంటర్ పరీక్షల ఫీజుల తేదీలు ఇవీ.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే ?

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన పరీక్షల ఫీజుల తేదీలను ఇంటర్​ బోర్డు ఖరారు చేసింది. ఇవాల్టి నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించని వారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. లేటు ఫీజు రూ. 100తో ఈనెల 25 నుంచి 31 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు, అలాగే, రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు, రూ.2 వేలతో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు.

ఇటీవల మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్​మెంట్ రాసుకోవచ్చునని స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement