Friday, April 26, 2024

అమెరికాను వణికించిన టోర్నడోలు… 21 మంది మృతి

అమెరికాలోని దక్షిణ, మధ్య ప్రాచ్య రాష్ట్రాల్లో టోర్నడోలు శుక్రవారం బీభత్సం సృష్టించాయి.. దీంతో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. టోర్నడోల ధాటికి పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నివాసాలు, దుకాణ సముదాయాలు నేలమట్టమయ్యాయి. వేల సంఖ్యలో నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది.. ఇండియానా రాష్ట్రంలోని సులివాన్‌ కౌంటీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరికొందరి జాడ తెలియట్లేదని అధికారులు తెలిపారు

ఆర్కన్సాస్‌ రాష్ట్ర రాజధాని లిటిల్‌ రాక్‌ నగరంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 25 మందికి గాయాలయ్యాయి. ఇల్లినాయ్‌ రాష్ట్రంలోని బెల్విడీర్‌లో సంగీత కార్యక్రమం జరుగుతున్న థియేటర్‌ నేలమట్టమై సందర్శకుల్లో ఒకరు మృతి చెందగా 28 మంది క్షతగాత్రులుగా మారారు. భీకర గాలులు వీస్తుండటంతో తమ నివాసాలను ఖాళీ చేయలని ఓక్లొహోమా నగరంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. టోర్నడోలతో దెబ్బతిన్న రాష్ట్రాలకు ఫె అండగా ఉంటా మని అధ్యక్షుడు జో బైడెన్‌ భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement