Friday, June 21, 2024

గ్రీన్‌ చాలెంజ్‌ సంతోష్‌కుమార్‌ కు గ్రీన్‌ రిబ్బన్‌ చాంపియన్‌ పురస్కారం

హైదరాబాద్‌, : పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మరో అవార్డును సొంతం చేసుకొన్నది. గ్రీన్‌ చాలెంజ్‌ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ను గ్రీన్‌ రిబ్బన్‌ చాంపియన్‌గా గుర్తిస్తూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నెట్‌వర్‌ 18 గ్రూప్‌ అవార్డును అందజేసింది. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల ఎంపీ సంతోష్‌ హాజరు కాలేకపోయారు. దీంతో నెట్‌వర్‌ 18 గ్రూప్‌ ప్రతినిధి ఎంపీ సంతోష్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి అవార్డును అందించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్పృహ, అన్నివర్గాల ప్రాతినిధ్యానికి కృషి, దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్‌ అంబాసిడర్లుగా ప్రమోట్‌ చేస్తున్నందుకు సంతోష్‌కుమార్‌ ఈ అవార్డుకు ఎంపికైనట్టు నెట్‌వర్‌ 18 గ్రూప్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement