Thursday, April 25, 2024

విజయ్‌ యేసుదాస్ ఇంట్లో.. భారీ దొంగ‌త‌నం

హీరో ర‌జ‌నీకాంత్ కుమారై ఐశ్వ‌ర్య ఇంట్లో భారీ దొంగ‌త‌నం మ‌ర‌వ‌క‌ముందే మరో ఫిల్మ్ స్టార్ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్‌ కుమారుడు, గాయకుడు, నటడు విజయ్‌ యేసుదాస్‌ ఇంట్లో కూడా భారీ దొంగతనం జరిగింది. దీని గురించి విజయ్‌ యేసుదాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలే ఏమైయ్యిందంటే.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఏసుదాసు తనయుడు విజయ్ ఏసుదాసు చెన్నైలోని అభిరామపురంలోని నివాసం ఉంటున్నారు. ఆయన నివాసంలో శుక్రవారం అనగా మార్చి 31, 2023నభారీగా దొంగతనం జరిగింది. ఈ చోటీలో భారీగా విలువైన భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలతో పాటు కొన్ని డాక్యూమెంట్టలు కూడా వారు పట్టుకుపోయినట్టు తెలుస్తోంది. దీని గురించి పోలీసులు ఫిర్యాదు చేసిన విజయ్‌ యేసుదాస్‌.. తన ఇంట్లో పని చేసేవారిపై అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement