Thursday, May 2, 2024

2024 తర్వాత పవన్ క‌ల్యాణ్ కి రాజకీయ భవిష్యత్ లేదు .. వేణు స్వామి ..

భార‌త దేశంలో జోత్యిష్యాన్ని న‌మ్మేవారికి కొద‌వే లేదు.. అయితే కొంద‌రు చెప్పే మాట‌లు ఊహించ‌ని రీతిలో నిజ‌మ‌వుతుండ‌టం కూడా వాస్త‌వ‌మే..అలా అని వారికి ఏవో అద్భుత శ‌క్తులు ఉన్నాయ‌ని కాదు.. వారి మేధో సంప‌త్తుని ఉప‌యోగించి ప‌లు విష‌యాల‌ను ముందుగానే ఊహించి చెబుతుంటారు. జ్యోతిష్కుడు వేణుస్వామి కూడా అంతే.. ఆయ‌న ఒక విష‌యం చెప్పారంటే అది జ‌రిగితీరుతుంది. అయితే ఆయ‌న ఇప్పుడు సంచ‌ల‌న వ్యాఖ్యాల‌ని చేయ‌డంతో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. మ‌రి ఆయ‌న ఏం చెప్పారో తెలుసా…

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటు సినిమాల‌తో , అటు రాజ‌కీయాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న్ని సీఎంగా కూడా చూడాల‌ని కోరుకుంటున్న త‌రుణంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపాయి. సీఎం మాటేమో గాని ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల‌కి దూరం కానున్నాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజమైన నేపథ్యంలో ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. 2019లో టీడీపీ ఓడిపోతుందని, సమంత ,నాగ చైతన్య విడిపోతార‌ని , అఖిల్ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్ళదని వేణు స్వామి చెప్పగా.. అలాగే జరిగింది. కాగా జగన్ మరో మూడు పర్యాయాలు సీఎం అవుతారని వేణు స్వామి చెప్పారు కూడా.

కాగా జ్యోతిష్కుడు వేణు స్వామి ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ కెరీర్ ముగియ‌నుంద‌నే వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కి తావిస్తున్నాయి… పవన్ మాట నిలకడలేని వ్యక్తి. ఒక సిద్ధాంతం అంటూ లేదు. అతడు అలా ప్రవర్తించడానికి కారణం.. జాతకమే అని చెప్పారు వేణు స్వామి. అంతేకాదు 2024 తర్వాత పవన్ కి రాజకీయ భవిష్యత్ లేదన్నారు. ఆయన పాలిటిక్స్ నుండి తప్పుకుంటారు. ఆయన జాతకం ప్రకారం జరిగేది ఇదే. నా మాటలు కొందరిని బాధపెట్టవచ్చు. దాని వలన నాపై దాడులు కూడా జరగవచ్చు. అయితే నేను ఎవరికీ భయపడను. జాతకం ఏమి చెబుతుందో అదే చెబుతాన‌ని నొక్కి వ‌క్కాణించారు. మ‌రి వేణుస్వామి వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఏ విధంగా రియాక్ట్ కానున్నారో మ‌రి. వేణుస్వామి వ్యాఖ్య‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతాయో తెలియాలంటే కొన్ని ఏళ్ళు వేచి చూడాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement