Friday, May 3, 2024

గడ్చిరోలిలో కాల్పుల మోత.. 13 మంది మావోయిస్టులు హతం

మహారాష్ట్రలో  గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 13 మావోయిస్టులు మృతిచెందారు. పోటేగావ్, రాజోలీ మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సీ-60 కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గ్రామానికి సమీపంలో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించారు. అయితే, పోలీసులు రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎదురు కాల్పులు ప్రారంభించడంతో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలిలో కొన్ని ఆయుధాలు, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి డీఐజీ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement