Monday, May 6, 2024

Breaking: న్యూయార్క్‌లో ఉగ్ర‌దాడి.. బ్రూక్లీన్ స‌బ్‌వే ద‌గ్గ‌ర కాల్పులు, 13 మంది మృతి

న్యూయార్క్ సిటీ ఉగ్ర‌దాడితో ఉలిక్కిప‌డింది. బ్రూక్లీన్ స‌బ్‌వే ద‌గ్గ‌ర ముఖాల‌కు గ్లాస్ షీల్డ్ వేసుకున్న కొంత‌మంది దుండ‌గులు ఒక్క‌సారిగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లో 13మంది అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. చాలామందికి తీవ్ర‌ గాయాల‌య్యాయి.. కాల్పులు జ‌ర‌గ్గానే ఒక్క‌సారిగా జ‌నం ప‌రుగెత్త‌డంతో ఒక‌రిపై ఒక‌రు ప‌డిపోయారు. ఇట్లా జ‌రిగిన తొక్కిస‌లాట‌లో కూడా చాలామందికి గాయాల‌య్యాయి. దాడి బాధితుల్లో ఇండియ‌న్స్ ఉండొచ్చ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాగా, న్యూయార్క్ లోని భార‌త ఎంబ‌సీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉగ్ర‌దాడి బాధితుల్లో భార‌తీయులున్న‌ట్టు ఎంబ‌సీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement