Friday, April 26, 2024

తిరుమ‌ల‌లో ఫుల్​ రష్​.. స‌ర్వ‌ద‌ర్శ‌నం స్లాట్ల‌ను ర‌ద్దు చేసిన టీటీడీ

తిరుమల: వేస‌వి కాలం, శ్రీ‌వారి స‌న్నిధికి చేరాల‌న్న కోరిక‌తో చాలామంది భక్తులు తిరుమ‌ల‌కు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో కొండ‌పైన ర‌ద్దీ బాగా పెరిగింది. ర‌ద్దీ పెర‌గ‌డంతో ఎన్న‌డూ లేని ప‌రిస్థితులు తిరుమ‌ల‌లో నెల‌కొన్నాయి. దీంతో భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం దాదాపు 20 నుంచి 30 గంట‌ల‌పాటు వేచి ఉండాల్సిన ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. అందుక‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

అన్యూహ రద్ది కారణంగా సర్వదర్శనం స్టాట్ల‌ విధానాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్టు అదనపు ఈవో దర్మారెడ్డి తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచి ఉన్న భక్తులుకు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇక‌మీద‌ట తిరుమ‌ల‌కు రావాల‌నుకునే వారు ర‌ద్దీకి అనుగుణంగా త‌మ ప‌ర్య‌ట‌న‌ను ప్లాన్ చేసుకోవాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement