Monday, May 6, 2024

Breaking: గుజరాత్​ ఘటన.. బీజేపీ ఎంపీ కుటుంబంలోని 12 మంది మృతి

గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలిన ఘటనలో రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలతో సహా తన కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయానని ఆయన మీడియాతో చెప్పారు. తన సోదరి కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులను కోల్పోయానని మోహన్‌భాయ్ కళ్యాణ్‌ కుందారియా అన్నారు.

ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నాయి. ప్రమాదంలో బయటపడిన వారందరినీ రక్షించారు. మచ్చు నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ బోట్లు కూడా ఉపయోగిస్తున్నారు.

గుజరాత్‌లోని మోర్బీ సిటీలోని మచ్చు నదిపై శతాబ్దాల నాటి కేబుల్​ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటికి 141 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు, అందులో ఎక్కువ మంది మహిళలు, పిల్లలున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ, ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక పరిపాలనకు చెందిన ఐదు బృందాలు యుద్ధ ప్రాతిపదికన సెర్చ్, రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

మోహన్‌భాయ్ కళ్యాణ్‌ కుందారియా, రాజ్​కోట్​ బీజేపీ ఎంపీ

బ్రిడ్జిని తెరవడానికి ఎలా అనుమతి ఇచ్చారని బీజేపీ ఎంపీని ప్రశ్నించగా.. ఈ విషాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతామని, బాధ్యులను శిక్షిస్తామని, మృతుల్లో మహిళలు, పిల్లలు, స్థానికులు, ఎన్జీవోలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు.  

- Advertisement -

ఇప్పటికైతే 141 మందికి పైగా మృతదేహాలను వెలికి తీశారు, అందులో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులున్నారు. NDRF రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. తాము ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం, ఇది చాలా బాధాకరం ”అని హోం మంత్రి అన్నారు.

ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు

గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఈ ఘటనను సీరియస్​గా పరిగణిస్తున్నట్టు చెప్పారు.​ రాష్ట్ర రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్బీలో జరిగిన ఘటనపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.

ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కూలిన ఘటనలో సెక్షన్‌లు 304 ,  308, 114 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సంఘవి తెలిపారు.

మృతులకు, క్షతగాత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

విలేకరుల సమావేశంలో హర్ష సంఘవి మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఇప్పటి వరకు141 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వంతెన కూలిపోయింది. దీపావళి సెలవులు, ఆదివారం కావడంతో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన వంతెన.. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్లు జరిగాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement