Tuesday, April 30, 2024

అర్థ‌రాత్రి 10కి.మీ ర‌న్నింగ్ – ఎందుకో తెలుసా

పొద్దున వెళితే ..అర్థ‌రాత్రి వ‌ర‌కు డ్యూటీ..దాంతో రాత్రి విధులు ముగిస‌న త‌ర్వాత ప‌ది కిలోమీట‌ర్ల దూరంలోని బ‌రోలాలో ఉన్న త‌న ఇంటికి ప‌రిగెత్తుతూ వెళ్ళ‌డం 19ఏళ్ల కుర్రాడు ప్ర‌దీప్ మెహ్రాకి దిన‌చ‌ర్య‌గా మారింది. చ‌దువు ఒక‌ప‌క్క‌..మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో ప‌ని మ‌రొప‌క్క ..ఇలా నిత్యం బిజీ లైఫ్ ఈ కుర్రాడిది. అతడితోపాటు అతడి సోదరుడు, అమ్మ కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ రోజు రాత్రి నిర్మాత వినోద్ కాప్రి దృష్టిలో ప్రదీప్ పడ్డాడు. ‘‘ఎందుకు రాత్రి వేళ అలా పరుగెత్తుతున్నావు, నా కారులో రా దిగబెడతాను’’ అంటూ ఆఫర్ చేశాడు. అయినా ఆ బాలుడు రావడానికి నిరాకరించాడు. అయినా వినోద్ కాప్రి అలా వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆ బాలుడితో మాటలు కలిపాడు. ఉదయం రన్నింగ్ చేయొచ్చుగా? అని ప్రశ్నించాడు. దాంతో అప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందని, సమయం చాలదని అతడు బదులిచ్చాడు.

ఇలా ఒక్కసారి కాదు.. ఎన్నో పర్యాయాలు లిఫ్ట్ ఇస్తానన్నా, ఆ బాలుడు తీసుకోలేదు. ఆర్మీలో చేరడమే తన ధ్యేయమని ప్రదీప్ చెప్పడం గమనార్హం. అందుకోసమే నిత్యం సాధనలో భాగంగా రన్నింగ్ చేస్తున్నానని.. కారులో వస్తే తన సాధన గాడితప్పుతుందన్నాడు. ప్రతి రోజు పొద్దున 8 గంటలకు లేవాలి. పనికి వెళ్లడానికి ముందు ఆహారం సిద్ధం చేసుకోవాలి. రాత్రి వచ్చిన తర్వాత కూడా ఆహారాన్ని వండుకుని తినడమే కాదు.. రాత్రి షిప్ట్ ఉద్యోగానికి వెళ్లిన సోదరుడి కోసం కూడా ఆహారాన్ని ప్రదీప్ సిద్ధం చేయాలి. ఇది అతడి దినచర్య. ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షల మంది చూశారు.

https://twitter.com/vinodkapri/status/1505535421589377025
Advertisement

తాజా వార్తలు

Advertisement