Monday, April 29, 2024

Telangana: జోగుళాంబ అమ్మవారికి 100 కోట్ల విరాళం.. చెక్కు చూసి షాక్​ తిన్న ఆలయ అధికారులు

గద్వాల్​ జిల్లా అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి హుండీ లెక్కింపులో  100 కోట్ల రూపాయ విరాళంగా ఇచ్చిన చెక్కు ఒకటి కనిపించింది. దీన్ని చూసిన ఆలయ అధికారులు ఒక్కసారిగా షాక్​కి గురయ్యారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో అమ్మవారికి విరాళంగా రావడం ఆలయ చరిత్రలోనే లేదు. అయితే.. ఆ చెక్కు వివరాలను పరిశీలించిన అధికారులకు నిజంగానే 100 ఓల్టుల కరెంట్​ షాక్​​ ఒక్కసారిగా తగిలినంత పని అయ్యింది..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్​ జిల్లాలో ఉన్న జోగుళాంబ అమ్మవారి ఆలయం శక్తిపీఠంగా వర్థిల్లుతోంది. అమ్మవారి ఆశీస్సులుంటే అనుకున్నది సాధిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే ఈ ఆలయానికి కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. కాగా, జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీలో నగదు లెక్కిస్తున్న అధికారులు రూ.100 కోట్ల చెక్కును చూసి అదిరిపడ్డారు. ఆలయ చరిత్రలో అంత పెద్ద మొత్తం హుండీ ద్వారా ఎప్పుడూ లభించలేదు.

అయితే.. ఆ చెక్కుపై ‘అక్షరాలా వంద కోట్ల రూపాయలు’ అని రాసి ఉంది. ఇక.. ఆ చెక్కు నిజమైనదేనా అని అనుమానం వచ్చిన ఆలయ అధికారులు దాని వివరాలను ఆరా తీస్తే ఆసక్తికర సంగతులు వెల్లడయ్యాయి. ఆ చెక్కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వరంగల్ బ్రాంచికి చెందిందదని తెలిసింది. ఆ చెక్కును హుండీలో వేసిన వ్యక్తి కూడా ఆలంపూర్ మండలానికి చెందినవాడేనని కనుగొన్నారు.

అయితే.. ఆ చెక్కు హుండీలో వేసిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని గుర్తించారు. వంద కోట్లు అని రాసిన ఆ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఉన్నది కేవలం 23 వేల రూపాయలు మాత్రమే అని బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అంతేకాకుండా అతను తన చెక్కుపై ‘ఆర్మీ జవాన్ల కోసం’ అని రాసినట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన అధికారులు.. పోలీసుల ద్వారా అతడిని హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement