Saturday, April 27, 2024

సింగిల్ విండో పాల‌సీ – స్టార్ట‌ప్ ల‌కు వేదిక వి హ‌బ్ః కెటిఆర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తామేమీ తక్కువ కాదంటూ అన్ని రంగాల్లో దూసుకుపో తున్న మహిళలను ప్రోత్సహించడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటీ రామారావు అన్నారు. మహిళా పారి శ్రామిక వేత్తల కోసం త్వరలోనే కొత్తగా ఒక సింగిల్‌ విండో పాలసీ తీసుకువస్తామని ఆయన ప్రకటిం చారు. ఉన్నత విద్యావంతులైన మహిళలు, ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక రంగంలో సుస్థిరతను సాధిం చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెట్టు బడులను భద్రతతో పాటు సంపూర్ణ బరోసాను ఇచ్చి ప్రోత్సహించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం అనేక పథ కాలను, రాయితీలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద ర్భంగా బుధవారం జరిగిన వి-హబ్‌ ఐదవ వార్షికో త్సవానికి మంత్రి కేటీ-ఆర్‌ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలో, ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే, రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలతో ప్రభుత్వంచేయూతనిస్తోందని తెలిపారు. వి-హబ్‌ ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తుండడం శుభ పరిణామమని పేర్కొన్నారు.


గ్రామ, మండల స్థాయి నుంచి ఔత్సాహిక మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు వీలుగా సింగిల్‌ విండో విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. అది మహిళా సాధికారతను రెట్టింపు చేసేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇకపై పెద్దగా కష్టపడకుండా, పైరవీలు లేకుండా సింగిల్‌ విండో పద్ధతితో అనుమతులు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. విద్యార్థినులు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేటీ-ఆర్‌ తెలిపారు. వి-హబ్‌ ద్వారా మహిళలు ఎదగటమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించటం సంతోషకరమని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు
రాష్టరంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అనేక కోనాల్లో ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ”రూ.1.30కోట్లు- ఇస్తే వి హబ్‌ నుంచి ఒక స్టార్టప్‌తో రూ.70 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నాం. రూ.750 కోట్లు- వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నాం. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు..? ప్రతీ పారిశ్రామిక పార్క్‌లలో 10శాతం ప్లాట్స్‌ మహిళలకు కేటాయించాం. ప్రతీ 3 కొవిడ్‌ టీ-కాల్లో రెండు హైదరాబాద్‌ నుంచి వచ్చాయి” అని పేర్కొన్నారు.

అమ్మాయిలు తక్కువనే భావన వద్దు
నేటి సమాజంలో ఎందులోనూ తాము తక్కువ కాదన్న స్థాయిలో విద్య, వైద్యం.. లాంటి అనేక రంగాల్లో బాలికలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో అమ్మాయి తక్కువ అనే భావనను తల్లిదండ్రులు విడనాడాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్‌ చేసేలా డ్వాక్రా సంఘాల ద్వారా ఇంటి నుంచే నేర్పుతున్నామని పేర్కొన్నారు. మానవ వనరులు, సాంకేతికత సద్వినియోగంతో మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మెళకువలు నేర్పాలన్న మంత్రి కేటీ-ఆర్‌.. ఆలోచించే విధానంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. తప్పు జరిగితే మళ్లీ నేర్చుకుంటాం… అయినా, వెనుకాడవద్దని మహిళలకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement