Friday, April 19, 2024

అకాడమిల పేరుతో దగ‌..!.. శ్రీచైతన్య-నారాయణ కాలేజీల ఇష్టారాజ్యం..

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి) కార్పొరేట్‌ దిగ్గజాలుగా వెలుగొందుతున్న శ్రీచైతన్య- నారాయణ విద్యాసంస్థలు చట్టం లోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి…కొందరు అధికారుల అవినీతి నేపథ్యంలో వీరి విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది…అకాడమిల పేరుతో నిర్భయంగా కాలేజీలు నడుపుతున్నారు…వాస్తవానికి అకాడమి అనే దానికి ఇంటర్మీడియట్‌ బోర్డునుండి ఎలాంటి అనుమతులు లేవు. ఇదే వీరికి కలిసి వస్తోంది. అకాడమిల పేరుతో శిక్షణ ఇస్తూ దండిగా వసూలు చేస్తున్నారు…అకాడమిలో చేరే వారివద్దనుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు…లక్ష పైనుండి మూడు లక్షల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు….అకాడమి పేరుతో విద్యా వ్యాపారం చేస్తున్నా అధికారులు మాత్రం తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్నారు…జూనియర్‌ కాలేజీలతోపాటు అకాడమిల నిర్వహిస్తున్నారు….ఇందులో ఇంటర్‌ విద్యార్థులకు కూడా అడ్వాంసులుగా శిక్షణ ఇస్తున్నారు…ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో వ్యాపారం చేస్తున్నారు…ఈ రెండు కాలేజీల పరిధిలో వందకు పైగానే అకాడమిల పేరుతో దర్జాగా విద్యా వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు.

ఎన్నో సంవత్సరాలుగా విద్యా వ్యాపారం చేస్తున్నారు శ్రీచైతన్య- నారాయణ విద్యా సంస్థలు…ఎక్కువ డబ్బులు పేరెంట్స్‌ నుండి ఎలా గుంజాలనే దానిపై వీరికి పూర్తిగా అవగాహన ఉంది. కొత్తకొత్త పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తున్నారు. చెప్పే చదువు ఒక్కటే కానీ వాటికి వివిధ పేర్లు తగిలించి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు. అకాడమిల పేరుతో దగా చేస్తున్నారు. అకాడమిలో చేరితే పిల్లలకు ఉచితంగా సీట్లు వస్తాయనే భ్రమలు కల్పిస్తున్నారు…వీరినుండి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు..అకాడమిలో చేరిన వారందరికీ ఉచిత సీట్లు రావాలి. కానీ కొందరికే సీట్లు వస్తున్నా తల్లిదండ్రులకు అనుమానం రాకుండా మ్యానేజ్‌ చేస్తున్నారు…ఏదో కారణాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారు. అకాడమిలు ఎవరి పరిధిలోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఇంటర్మీడియట్‌ బోర్డు నుండి కూడా ఎలాంటి అనుమతులు లేవు. అకాడమి ని సృష్టించి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా వీరిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అకాడమిలో ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ల శిక్షణ ఇస్తున్నారు…ఇందులో ఇంటర్‌ విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. కొందరు ఇంటర్‌ తరువాత సీట్లు రాకపోవడంతో అకాడమిలో చేరి శిక్షణ తీసుకుంటున్నారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులను కూడా అకాడమిల్లో చేర్చుకుని ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్‌లో విధిగా 222 రోజులపాటు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నెలరోజులపాటు మాత్రమే క్లాసులు నిర్వహించి పూర్తిగా అకాడమిలోనే అడ్వాంస్‌ శిక్షణ ఇస్తున్నారు… ఇంటర్‌తోపాటు నీట్‌, ఎంసెట్‌, ఐఐటీ శిక్షణ కూడా తోడు కావడంతో విద్యార్థులపై భారం పడుతోంది. మానసిక, శారీరక వత్తిడీలకు లోనవుతున్నారు…అకాడమిలో చెప్పేది సరిగా అర్థం కాకపోవడంతో అర్ధత సాధించలేక పోతున్నారు. అకాడమిలో చేరిన వారిలో సగంమందికి కూడా కౌన్సెలింగ్‌ సీట్లు రావడంలేదంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.

సగం వరకు అకాడమిలే..
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో శ్రీచైతన్య- నారాయణ కార్పొరేట్‌ కాలేజీల హవా కొనసాగుతోంది. హైదరాబాద్‌ చుట్టూరా వీరి కాలేజీల రాజ్యం నడుస్తోంది. 200లకు పైగానే కాలేజీలుండగా వీటిలో సగం వరకు అకాడమిల పేరుతో దందా కొనసాగిస్తున్నారు…మూడు జిల్లాల పరిధిలో సగం వరకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. అకాడమిలకు అనుమతులు లేవు. అందులో సగం వాటిని అకాడమిల పేరుతో నిర్వహిస్తున్నారు. అకాడమిలు ఎవరి పరిధిలో నడుస్తున్నాయనే దానిపై నేటికీ క్లారిటీ లేదు. ఇంటర్మీడియట్‌ బోర్డు కూడా అకాడమిలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. మరి ఎవరి అనుమతితో అకాడమిలు నడుస్తున్నాయనే దానిపై నేటికీ స్పష్టత లేదు. చట్టంలోని లొసుగులను ఆసరగా చేసుకుని ఈ రెండు కార్పొరేట్‌ సంస్థలు విద్యా వ్యాపారం చేస్తున్నారు. అకాడమిలకు ఎలాంటి అనుమతులు లేవు. ఇది చైనా బ్యాచ్‌కు కలిసి వస్తోంది. పేరెంట్స్‌ను బూరడీ కొట్టించి దండిగా సంపాధించుకుంటున్నారు. రోజుకో చోట అకాడమిలను ఏర్పాటు చేస్తూ విద్యా వ్యాపారం చేస్తున్నారు.. చిన్నచిన్న ప్రైవేట్‌ కాలేజీలు రోజుకోటి మూతపడుతున్నా ఈ కార్పొరేట్‌ కాలేజీలు మాత్రం విద్యా సంవత్సరంలో పలు కేంద్రాల్లో విస్తరిస్తున్నారు. శివార్లలో ఇప్పటికే వీరిదే రాజ్యం..మెళ్లి మెళ్లిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు…అకాడమి పేరుతో దగా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వీరికి అడ్డూ అదుపు లేకుండాపోయింది.

- Advertisement -

సోద్యం చూస్తున్న అధికారులు..
అకాడమిల పేరుతో శ్రీచైతన్య- నారాయణ విద్యా సంస్థలు వ్యాపారం చేస్తూ వందలాది కోట్లు సంపాధిస్తున్నా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అకాడమిలు ఎవరి పరిధిలోకి వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. కార్పొరేట్‌ సంస్థల పేరుతో అకాడమిలు కొనసాగుతున్నాయి. అనుమతుల విషయమై స్పష్టత వస్తే కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఆ దిశగా ఆలోచించడం లేదు. తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్నారు. తప్పిస్తే అకాడమి పేరుతో డబ్బులు దండుకుంటున్నారనే విషయాన్ని గ్రహించడం లేదు. విద్యార్థుల నుండి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం పైసా చెల్లించడం లేదు. వందలాది కోట్ల వ్యాపారం కేవలం అకాడమిల పేరుతో కొనసాగిస్తున్నారు. అలాంటప్పుడు వీరినుండి ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం పై ఎందుకు దృష్టిని కేంద్రీకరించడం లేదనే దానిపై అనుమతులు నెలకొన్నాయి. తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకోవడం కాదు. ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెంచాలనే దానిపై ఆలోచిస్తే బాగుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement