Thursday, May 2, 2024

Kohli : కోహ్లీ లేకుండా ప్ర‌పంచ క‌ప్ – ఊహించ‌లేం భ‌య్యా..

వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో చేజార్చుకున్న భారత జట్టు జూన్‌లో వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మెగాటోర్నీలో ఆడే ఆటగాళ్ల విషయం పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దృష్టి పెట్టింది.

- Advertisement -

ఈ క్రమంలో ఓ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్త‌లు హాల్ చ‌ల్ చేస్తున్నాయి. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని టీ20 జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. వెస్టిండీస్‌లో పిచ్‌లు చాలా స్లో ఉంటాయి. కోహ్లి బ్యాటింగ్ శైలి అక్కడ నప్పదని బీసీసీఐ భావిస్తోందట. కొన్నాళ్లుగా టీ20 ఫార్మాట్‌లో కోహ్లి ఫామ్ పై పట్ల బీసీసీఐ సంతృప్తిగా లేదని, అతడిని తప్పించి యువ ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావిస్తుందని అంటున్నారు. కోహ్లిని తప్పించడం అనేది అంత సులువైన విషయం కాదు. అందుకని అతడే స్వయంగా తప్పుకునేటట్లు చేసే బాధ్యతలను బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు అప్పజెప్పినట్లు ఆ వార్తల సారాంశం.

ఏడాది తరువాత టీ20 జట్టులోకి వచ్చి..
టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్ అనంతరం సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. ఏడాది తరువాత ఈ సంవత్సరం జనవరిలో జరిగిన అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో తిరిగి టీ20 జట్టులోకి వచ్చారు. ఆఖరి టీ20 మ్యాచ్‌లో ప్రతికూల పరిస్థితుల్లో రోహిత్ శర్మ సెంచరీ చేసి సత్తా చాటాడు. అదే సమయంలో ఈ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో మాత్రమే ఆడిన కోహ్లి ఓ మ్యాచ్‌లో 29 పరుగులు చేయగా, మరో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

యశస్వి జైస్వాల్‌, శివమ్ దూబె, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో సత్తాచాటారు. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్‌లు గాయాల నుంచి కోలుకుని తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో జట్టు కూర్పు సెలక్టర్లకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో ఐపీఎల్ 2024 సీజన్‌లో వీరందరి ప్రదర్శన తరువాత సెలక్టర్లు టీ20 ప్రపంచకప్ జట్టు పై ఓ అంచనాకు రావొచ్చు. అయితే.. కోహ్లి ఐపీఎల్‌లో ఎలా ఆడుతాడు అనేదానిపైనే అతడి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement