Monday, May 13, 2024

Cricket: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022.. భారత్‌- పాక్‌ తొలిపోరు

న్యూఢిళ్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో తలపడే భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15మంది సభ్యుల జట్టును బోర్డు ఖరారు చేసింది. హైదరాబాదీ స్టార్‌, బ్యాటింగ్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ భారతజట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మార్చిలో జరిగే మహిళల ప్రపంచకప్‌కు ముందు భారతజట్టు వచ్చే నెల 11నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఆడనుంది. అనంతరం ప్రపంచకప్‌లో మిథాలీసేన తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తో మార్చి 6న తలపడనుంది. మార్చి 10న టౌరంగ వేదికగా న్యూజిలాండ్‌తో, 12న హామిల్టన్‌ వేదికగా వెస్టిండీస్‌తో, 16న టౌరంగ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, 19న ఆక్లాండ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో, హామిల్టన్‌ వేదికగా 22న బంగ్లాదేశ్‌తో, క్రిస్ట్‌ చర్చ్‌ వేదికగా 27న దక్షిణాఫ్రికాతో గ్రూప్‌ దశ మ్యాచ్‌ల్లో మిథాలీసేన తలపడనుంది.

ఈ టోర్నీకి టాపార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌తోపాటు పూనమ్‌రౌత్‌, పేసర్‌ శిఖాపాండేను ఎంపిక చేయలేదు. కాగా మహిళల వన్డే ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌ వేదికగా మార్చి 4నుంచి ఏప్రిల్‌ 3వరకు జరగనుంది. మిథాలీరాజ్‌ నేతృతంలోని భారతజట్టు 2017లో జరిగిన గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచకప్‌ 2022 తరాత మిథాలీరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనుంది.స్మృతి మంధాన, దీప్తీశర్మ, ఝులన్‌ గోస్వామి, యువ బ్యాటింగ్‌ సంచలనం షెఫాలీవర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్లు రిచాఘోష్‌, తానియా భాటియా 15మంది సభ్యుల బృందంలో చోటు దక్కించుకున్నారు. ఇటీవల ఛాలెంజర్‌ట్రోఫీలో అత్యధిక స్కోరు సాధించిన సబ్బినేని మేఘన, ఏక్తా బిసత్‌, సిమ్రన్‌ దిల్‌ బహదూర్‌..ఈ ముగ్గురు స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. భారతజట్టు మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శిఖాను తప్పించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసినా సెలక్షన్‌ కమిటీ సమతుల్య జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది.

జెమీమా రెట్టించిన ఉత్సాహంతో తిరిగి జట్టులో చోటు సంపాదించాలి. జులన్‌తోపాటు శిఖా సీనియర్‌ పేసర్‌గా ఉంది. అయినా ఆమెకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదు. జులన్‌ తరలోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనుంది. శిఖా మళ్లిd తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని డయానా పేర్కొంది. సీనియర్లు యువ ప్లేయర్లుకు మార్గదర్శనం చేస్తారు. ఆస్ట్రేలియాలో షార్ట్‌బాల్‌ ఎదుర్కోవడంలో తన బలహీనతను ప్రదర్శించిన టీనేజ్‌ సంచలనం షెఫాలీవర్మ మరింత స్థిరంగా ఆడాలి. పేసర్ల విషయంలో షెఫాలీ మరింత నిలకడగా ఆడాలి. ఈ మెగా ఈవెంట్‌లో పేస్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రకర్‌ పాత్ర చాలా కీలకం. భారత్‌ తమ ప్రపంచకప్‌ ప్రస్థానాన్ని మార్చి 6న బే ఓవల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ప్రారంభిస్తుంది. ఆ తరాత మార్చి 10న ఆతిథ్య న్యూజిలాండ్‌తో తలపడుతుంది.కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు హర్మన్‌ప్రీత్‌కౌర్‌ సారథ్యంలోని భారతజట్టు ఫిబ్రవరి 9న టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఐసీసీ ప్రపంచకప్‌, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడే భారతజట్టు, కివీస్‌తో టీ20 మ్యాచ్‌లో తలపడేజట్టు ఈవిధంగా ఉంది.

భారత వన్డేజట్టు: మిథాలీరాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతి మంధాన, షెఫాలీవర్మ, యాస్తిక బాటియా, దీప్తిశర్మ, రిచాఘోష్‌ (వికెట్‌కీపర్‌), స్నేహరాణా, జులన్‌ గోస్వామి, పూజా వస్త్రకర్‌, మేఘనాసింగ్‌, రేణుకాసింగ్‌ ఠాకూర్‌, తానియా బాటియా (వికెట్‌కీపర్‌), రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌. స్టాండ్‌బై ప్లేయర్లు: సబ్బినేని మేఘన, ఏక్తాబిస్త్‌, సిమ్రాన్‌ దిల్‌ బహదూర్‌.

భారత టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్‌కౌర్‌(కెప్టెన్‌), స్మృతిమంధాన (వైస్‌కెప్టెన్‌), షెఫాలీవర్మ, యస్తిక బాటియా, దీప్తీశర్మ, రిచాఘోష్‌ (వికెట్‌కీపర్‌), స్నేహరాణా, పూజవస్త్రకర్‌, మేఘనాసింగ్‌, రేణుకాసింగ్‌ ఠాకూర్‌, తానియా బాటియా (వికెట్‌కీపర్‌), రాజేశ్వర్‌గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, ఏక్తాబిస్త్‌, ఎస్‌ మేఘన, సిమ్రన్‌ దిల్‌ బహదూర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement