Saturday, May 4, 2024

చిన్న‌నాటి స్నేహితుల‌తో.. రాంచీ ఫాంహౌస్ లో ధోని

రీసెంట్ గా ఐపీఎల్ 16వ సీజ‌న్ ముగిసింది. దాంతో క్రికెట‌ర్ ధోనీ ఇంటిప‌ట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నాడు. కాస్త ముదురు వయసులోనూ చెన్నై సూపర్ కింగ్స్ కు టైటిల్ అందించి తనలో చేవ తగ్గలేదని చాటిన మహీ… తీరిక సమయాల్లో ఏంచేస్తుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫాంహౌస్ లో ఆర్గానిక్ సేద్యం, కడక్ నాథ్ కోళ్ల పెంపకంతో కాలం గడుపుతుంటాడు. పనేమీ లేకపోతే తన గ్యారేజిలోని మోటార్ సైకిళ్లకు సర్వీసింగ్ చేస్తుంటాడు. ఇక స్నేహితులను వెంటేసుకుని తిరగడం, వారికి తన ఇంట ఆతిథ్యం ఇవ్వడంలోనూ ధోనీ ముందుంటాడు. తాజాగా కొందరు స్నేహితులతో కలిసి ధోనీ రాంచీలోని తన ఫాంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ధోనీ ఇప్పటికీ చిన్ననాటి స్నేహితులను మరువకపోవడం నిజంగా గొప్ప విషయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement