Monday, April 29, 2024

పుష్ప‌2 మూవీ నుండి.. యాక్షన్ సీన్ లీక్

పుష్ప‌2 మూవీ నుండి యాక్ష‌న్ సీన్ వీడియో లీక‌యింది. ఈ వీడియోలో ఎర్రచందనం లోడ్ తో నాలుగు లారీలు నదిలో వెళ్తుండగా.. పోలీసులు వాటిని చేజ్ చేస్తూ వెళ్తున్నారు. అయితే ఇది అవుడ్ డోర్ షూటింగ్ కావడంతో కొందరు అభిమానులు ఆ విజువల్స్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. హీరోయిన్ రష్మిక, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగపతి బాబు బలమైన పాత్రలో కనిపించనున్నారట‌.పుష్ప 2.. దేశవ్యాప్తంగా సినీప్రియులలో క్యూరియాసిటి నెలకొన్న చిత్రం. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement