Sunday, May 19, 2024

విలియమ్సన్‌కి మళ్లి గాయం.. మూడు మ్యాచ్‌లకు దూరం

న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ మళ్లి గాయం బారిన పడ్డాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్‌ విలియమ్స్‌ చేతి వేలికి గాయం అయింది. గాయం తీవ్రత ఎక్కుకగా ఉండటంతో అతను తర్వాతి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని కివీస్‌ క్రికెట్‌ బోర్డు వెల్లఢించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించి ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ చేసింది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌ 107 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 78 పరుగులు చేశాడు. అనంతరం నోప్పి ఎక్కువవడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. బ్యాటింగ్‌ చేస్తున్న విలియమ్సన్‌ పరుగు తీస్తుండగా బంగ్లా ఫీల్డర్‌ బంతిని బలంగా విసిరాడు. అది నేరుగా వచ్చి రన్‌ తీస్తున్న కేన్‌ చేతికి తగిలింది. నొప్పితో విలవిలలాడిన విలియమ్సన్‌ ఫిజియో చికిత్స తీసుకొని మళ్లి బ్యాటింగ్‌ కొనసాగించాడు.

కొద్ది సేపటికి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో విలియమ్సన్‌ రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. అప్పటికే కివీస్‌ విజయం దాదాపు ఖాయమైపోయింది. అనంతరం ఎక్స్‌రే రిపోర్టులో విలియమ్సన్‌ వేలికి ఫ్యాక్చర్‌ అని తేలింది. దీంతో అతను తర్వాతి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. కనీసం రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

దీంతో అక్టోబర్‌ 18న అఎn్గానిస్తాన్‌, అక్టోబర్‌ 22న భారత్‌, అక్టోబర్‌ 28న ఆస్ట్రేలియాతో జరగాల్సిన మూడు మ్యాచ్‌లకు విలియమ్సన్‌ దూరమయ్యాడు. అంతకుముందు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో గాయపడిన విలియమ్సన్‌ శాస్త్రచికిత్స తీసుకొని ఇప్పుడే కోలుకున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌ ఆడాడు. కానీ దురదృష్టవాత్తు మళ్లి గాయం బరిన పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement